తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కె.కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు నేతలు శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో తెరాసకు సంపూర్ణ బలం ఉన్నందున... వీరిద్దరి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. రెండు రాజ్యసభ స్థానాల కోసం దాదాపు చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వివిధ సమీకరణాల అనంతరం కేకే, సురేశ్ రెడ్డికి దక్కింది.
తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్ రెడ్డి
17:09 March 12
తెరాస రాజ్యసభ అభ్యర్థులుగా కేకే, సురేశ్ రెడ్డి
తన రాజ్యసభ గడువు ముగుస్తున్నందున.. మరోసారి అవకాశం కల్పించాలని ఆయన కేసీఆర్ను కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన మాజీ స్పీకర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కేఆర్ సురేశ్ రెడ్డికి గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకటి ఓసీకి, మరొకటి బీసీకి ఇవ్వాలని నిర్ణయించిన తెరాస నాయకత్వం... కేకేతో పాటు సురేశ్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది.
మఖ్య నేతలతో చర్చ అనంతరం నిర్ణయం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, దామోదర్ రావు, పారిశ్రామికవేత్త పార్థసారథి రెడ్డి, తదితరులు రాజ్యసభ స్థానం ఆశించినా.. నిరాశ మిగిలింది. మాజీ ఎంపీలు కవిత, వినోద్ కుమార్ పేర్లు కూడా ప్రచారం జరిగింది. సురేశ్ రెడ్డి అభ్యర్థిత్వంపై గురువారం మధ్యాహ్నం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తదితర ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించారు. త్వరలో ఖరారు చేయనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి అంశంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. తమను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కేకే, సురేశ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి:'పారాసెటమాల్తోనే కరోనాకు చికిత్స!'