Kites and Sweets Festival At Hyderabad :సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకోబోతుంది. కరోనా కారణంగా 2021 నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అధికారులు మధ్యాహ్నం కైట్ ఫెస్టివల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Congress Govt to Organize kites Ceremony at Hyderabad : ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగర పౌరులకు ఉచితంగా అవకాశాన్ని కల్పించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదంతో పాటు పసందైన రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, కొరియా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్ సహా 16 దేశల నుంచి నిపుణులైన అంతర్జాతీయ కైట్ ప్లేయర్ 40 మంది, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సాధారణ గాలిపటాల కంటే భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులను ఎగురవేయనున్నారు. రాత్రివేళ ఎగిరే పతంగులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!
Kites and Sweets Festival Start Jan 13th in Hyderabad :2016-17లో అగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ తర్వాత మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ మైదానంలో అధికారికంగా పతంగుల పండుగను నిర్వహించింది. ఆ మూడు సంవత్సరాలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వేడుకలను తిలకించారు. కరోనా కారణంగా మూడేళ్లు కైట్ ఫైస్టివల్కు నగరవాసులు దూరమయ్యారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో ఆ వేడుకలను పునరుద్ధరించాలని నిర్ణయంచిన ప్రభుత్వం, ఈ ఏడాది భారీ స్థాయిలో వేడుకలకు ఏర్పాటు చేసింది.