తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మంచి భవిష్యత్తు ఉందన్న కిషన్​రెడ్డి - Kishanreddy Participate Food Awards

Kishanreddy Participate Food Awards దేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని కేెంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్ల రుణాలు‌కేంద్రం ఇవ్వబోతుందని వెల్లడించారు. మాదాపూర్ నొవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఫుడ్ అవార్డ్స్ కార్యక్రమంలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు.

Kishanreddy
Kishanreddy

By

Published : Aug 27, 2022, 5:00 PM IST

Kishanreddy Participate Food Awards: దేశంలో పర్యాటక రంగం బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. కొవిడ్ నేపథ్యంలో దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్ల రుణాలను కేంద్రం ఇవ్వబోతుందని వెల్లడించారు. హైదరాబాద్ మాదాపూర్ నొవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో హైబిజ్ టీవీ ఆధ్వర్యంలో జరిగిన ఫుడ్ అవార్డ్స్ కార్యక్రమంలో కిషన్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక, ఆతిధ్య రంగాల్లో విశేష సేవలందిస్తున్న పలువురు యజమాన్యాలకు ఆయన పురస్కారాలు అందజేశారు.

శ్రీనివాసా ఫామ్స్ రిటైల్ బిజినెస్ హెడ్ హర్ష చిట్టూరి కిషన్​రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పద్మజారెడ్డి నాట్య ప్రదర్శన అలరించింది. దేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని కిషన్​రెడ్డి తెలిపారు. ఆయా రంగాల్లో పుష్కలమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్న దృష్ట్యా.. సేవా భావంతో వినియోగదారులకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు.

పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించాలని అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నాయని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా మానసా వారణాసి, సినీ నటి పూర్ణ, హైబిజ్ టీవీ యాజమాని రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

"పర్యాటక రంగం కానీ, ఆతిథ్యం రంగంలో రానున్న రోజుల్లో దేశంలో మంచి గుర్తింపు ఉంది. రానున్న రోజుల్లో సింగిల్ విండోలో అన్ని అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల కరోనా వల్ల దెబ్బతిన్న హోటల్ రంగాన్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్ల రుణాలను ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది." - కిషన్​రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

దేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలకు మంచి భవిష్యత్తు ఉందన్న కిషన్​రెడ్డి

ఇవీ చదవండి:భాజపా ఫ్లెక్సీలతో కాషాయమయంగా హనుమకొండ

ఆ అమ్మాయిలకు మళ్లీ నీట్‌ పరీక్ష, లోదుస్తుల వివాదంతోనే

ABOUT THE AUTHOR

...view details