ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భాజపా అవతరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. 12 కోట్ల మంది సభ్యత్వాలతో దూసుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్లోని తాజ్మహల్ హోటల్లో భాజపా రాష్ట్ర నాయకులతో పాటు ముఖ్య కార్యకర్తలతో కిషన్రెడ్డి సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న 12 కోట్ల సభ్యత్వాలను 19 కోట్ల వరకు చేర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సమాజ హితం కోసం దేశవ్యాప్తంగా భాజపాలో చేరికలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
'ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది' - central minister
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భాజపా అవతరించిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
'ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది'