రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కేంద్రంపై అసత్య ఆరోపణలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడగగానే 50 శాతం యూరియాను పంపినట్లు తెలిపారు. మరో 50 శాతం ఇంకో రెండు రోజుల్లో చేరుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని... రాష్ట్రం అడిగిన వెంటనే కేంద్రం యూరియా పంపుతుందని తెలిపారు.
'యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణం'
రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సర్కారు ముందస్తు ప్రణాళికను రూపొందించకపోవడం వల్లే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ సరిగ్గా లేకోవడమే కారణం
Last Updated : Sep 6, 2019, 2:17 PM IST