హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయాన్ని మాల మహానాడు నాయకులు ముట్టడించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా తన ప్రతిపాదనను ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ... కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మార్పీఎస్ మహా సభలో మద్ధతు తెలపడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
'కిషన్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలి' - Kishan Reddy
ఎస్సీ వర్గీకరణకు భాజపా మద్ధతు పలకడాన్ని నిరసిస్తూ.. మాల మహానాడు నాయకులు ఆందోళనకు దిగారు. బీజేపీ తన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
mala mahanadu