సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన తరువాత మెుదటిసారిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీలను సందర్శించారు. తనను గెలింపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బస్తీ వద్ద గత 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల కోసం మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఏర్పాటు చేశానని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా అక్కడికి వచ్చి చెప్పవచ్చని సూచించారు.
పార్టీలకు అతీతంగా భాజపాలో చేరండి: కిషన్ రెడ్డి
నాంపల్లి నియోజకవర్గంలో పలు కాలనీలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుకున్నారు.
kishanreddy
ఈరోజు హైదరాబాద్‌లో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ భాజపాలో చేరాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి;రాజ్యసభకు జైశంకర్, జుగల్ ఠాకూర్ ఎన్నిక