హైదరాబాద్‌లో వరదలపై ప్రధానమంత్రి దృష్టి సారించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందిన తర్వాత కేంద్ర నుంచి ఒక బృందాన్ని పంపి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
రాష్ట్రంలో వరదలపై ప్రధాని మోదీ దృష్టి సారించారు: కిషన్‌రెడ్డి - అధికారులతో కలిపి ఒక బృందం
తెలంగాణను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వరదలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక అందాక కేంద్ర బృందానికి పంపుతామన్నారు. రాష్ట్రంలో వరదలపై ప్రధాని మోదీ దృష్టి సారించారని ఆయన తెలిపారు. వివిధ శాఖల అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటివరకు రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులు వాడుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలో వరదలపై ప్రధాని మోదీ దృష్టి సారించారు: కిషన్‌రెడ్డి
వివిధ శాఖల అధికారులతో కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్న కిషన్‌రెడ్డి.. అంతవరకు రాష్ట్ర విపత్తు నిధి నుంచి నిధులు వాడుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం పార్టీలకతీతంగా పనిచేయాలన్నారు.
ఇదీ చూడండి :గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది: లక్ష్మణ్