ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతోందని తెలిపారు. చాలా దేశాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని చెప్పారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్రం పెట్టుబడులు ఆహ్వానిస్తోందని తెలిపారు. మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా రూ.70 వేల కోట్లు మూలధనంగా బ్యాంకులకు అందించినట్లు వివరించారు. ద్రవ్యోల్బణం 3శాతానికి కట్టడి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు కిషన్రెడ్డి వెల్లడించారు.
'ఉపాధి అవకాశాల వృద్ధితో ఆర్థికవ్యవస్థ బలోపేతం' - kishan reddy press meet
ద్రవ్యోల్బణాన్ని మూడుశాతానికి కట్టడి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు వృద్ధి చెందితేనే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన తెలిపారు.
'ఉపాధి అవకాశాలు మెరుగైతేనే ఆర్థిక వ్యవస్థ బలేపేతం'