Central Minister Kishan Reddy: ఉచితంగా మంచి నీరు ఇస్తామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం... అమలులో పూర్తిగా విఫలమైందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నారాయణగూడ శంషీర్ బాగ్‌లో సామాజిక నూతన భవన నిర్మాణానికి... ఆయన శంకుస్థాపన చేశారు. కొంతకాలంగా శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని ఆధునీకరించాలని స్థానికులు కోరడంతో... కూల్చివేసి అదే స్థానంలో ఎంపీ నిధుల కింద రూ. 27 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. బస్తీలో మంచి నీరు, విద్యుత్ బిల్లులు పెద్ద మొత్తంలో వస్తున్నాయని స్థానికులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కిషన్‌రెడ్డి ఆదేశించారు.
ఉచితంగా మంచినీరు ఇస్తామన్న ప్రభుత్వం విఫలమైంది: కిషన్‌రెడ్డి
Central Minister Kishan Reddy: హైదరాబాద్ నారాయణగూడలో సామాజిక నూతన భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధుల కింద రూ. 27 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించననున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కాగా బస్తీలో తాము ఎదుర్కొంటున్న తదితర సమస్యలపై స్థానికులు.. కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.
'ఉచితంగా మంచినీరు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. బస్తీల్లో చాలావరకు ప్రజలు తాగునీటి బిల్లుల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రోడ్డు సమస్యలు, డ్రైనీజీ సమస్యలు కూడా ఉన్నాయని ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని బస్తీల్లో ప్రజులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.' -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
ఇదీ చదవండి:Bandi Sanjay Letter To Kcr: 'సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం పాలమూరుకు రండి'