తెలంగాణ

telangana

ETV Bharat / state

'భారత్‌ బంద్'‌కు తెరాస మద్దతుపై కిషన్‌రెడ్డి ఫైర్​ - Kishan Reddy fires on Trs

ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఖండించారు. స్వార్థానికే సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. కేంద్రం తరఫున రైతులకు పూర్తి భరోసా ఇస్తున్నామని వెల్లడించారు.

Kishan Reddy fires on trs
'భారత్‌ బంద్'‌కు తెరాస మద్దతుపై కిషన్‌రెడ్డి ఫైర్​

By

Published : Dec 7, 2020, 6:27 PM IST

'భారత్‌ బంద్'‌కు తెరాస మద్దతుపై కిషన్‌రెడ్డి ఫైర్​

తెరాస స్వార్థ రాజకీయాల కోసమే వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అనేక మంది రైతులు, మేధావులు కోరిన విషయాలను చట్టం రూపంలో తెచ్చామన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగదని.. కేంద్రం తరఫున పూర్తి భరోసా ఇస్తున్నామని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో దుకాణాలు, రవాణా ఆపాలని ప్రభుత్వమే నిర్ణయించి... భారత్‌ బంద్‌కు మద్దతు పలకడం విచారకరమని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details