Kishan Reddy Fires on Telangana Government : పోలీసు నిర్భంధాలతో ఉద్యమాలను అణచివేస్తున్నారని.. తెలంగాణ ఉద్యమం వేళ ఇవే నిర్బంధాలు ఉంటే.. మంత్రి కేటీఆర్, కవిత విదేశాలకు పారిపోయేవారని.. కేంద్రమంత్రి, బీజపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగుల సమస్యలు(Kishan Reddy On Unemployment in Telangana) పరిష్కరించాలంటూ 24 గంటల పాటు నిరాహార దీక్షలో భాగంగా నిన్న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు.
Kishan Reddy Hunger Strike Ended :బుధవారంరాత్రికిషన్రెడ్డిని బలవంతంగా దీక్షాస్థలి నుంచి పోలీసులు తరలించగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి దీక్ష(Kishan Reddy Hunger Strike) కొనసాగించారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవడేకర్(BJP State Election in Charge Prakash Javadekar) నిమ్మరసం ఇచ్చి.. దీక్షను విరమింపజేశారు. ఉద్యమ సమయంలో తాను రాజీనామా చేయలేదంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన కిషన్‌రెడ్డి.. ఉద్యమం వేళ కేసీఆర్, కేటీఆర్ ఏనాడైనా రోడ్డెక్కారా అని ప్రశ్నించారు.
BJP Leaders Protested Across Telangana : మరోవైపు కిషన్‌రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని.. అక్రమ అరెస్టులకు బెదిరిపోబోమని నేతలు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్ల రిబ్బన్‌తో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నీరుద్యోగులను కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని, ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా.. ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచిన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.