Kishan Reddy Counter To Rahul Gandhi Statement : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రోజురోజుకు నాయకుల మధ్య విమర్శలు చెలరేగిపోతున్నాయి. ఇతర పార్టీ మైనస్‌లు చూపిస్తూ.. ప్రజలను తమవైవు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్బస్సు యాత్రలో (Congress Bus Yatra) భాగంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఏవి బీ పార్టీగా ఉన్నాయో తెలుసని వ్యంగ్యంగా మాట్లాడారు. కాగా ఈ మధ్య కాలంలో పార్టీలకు బీ పార్టీలంటూ రాజకీయనేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
Kishan Reddy Fires on Rahul Gandhi :హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అంటూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో కలిసి పని చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ను విలీనం చేస్తానన్నది నిజం కాదా అని ప్రశ్నించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నదా.. లేదా అంటూ నిలదీసిన ఆయన.. రేవంత్‌పై ఉన్న ఈ కేసుపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదని అన్నారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా.. ఎందుకు చేయడం లేదంటూ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారో రాహుల్‌గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు.