తెలంగాణ

telangana

ETV Bharat / state

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తూరు సీతయ్య గుప్త 108వ జయంతి ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుపేద వైశ్యులకు వృద్ధాప్యభృతి, ఉచిత బియ్యం, వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేశారు.

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

By

Published : Aug 10, 2019, 5:29 PM IST

సామాజిక సేవ చేయడంలో ఆర్య వైశ్యులు ఎప్పుడు ముందుంటారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాసవి సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కొత్తూరు సీతయ్య గుప్త 108వ జయంతి ఉత్సవాలు లక్డీకాఫుల్​లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం ప్రవేశపెట్టిందని అయితే అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదిస్తున్న దాంట్లో కొంత భాగాన్ని సమజాసేవ కోసం ఉపయోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సమాజ సేవ ప్రతి ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

ఇవీచూడండి: శంషాబాద్​ విమానాశ్రయంలో 9.2కిలోల బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details