తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2020, 9:11 PM IST

ETV Bharat / state

కరోనా నమూనాల సేకరణ కోసం కోవ్‌సాక్స్‌

కరోనా బాధితుల నమూనాలను సులభంగా సేకరించేందుకు డీఆర్‌డీవో హైదరాబాద్ విభాగం కోవ్‌సాక్స్ పేరుతో ఓ కియోస్కుని తయారుచేసింది. ఈమేరకు డీఆర్‌డీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Kiosk for the collection of Corona specimens
కరోనా నమూనాల సేకరణ కోసం కోవ్‌సాక్స్‌

కొవిడ్-19 నిర్మూలనలో భాగంగా హైదరాబాద్ ఈఎస్ఐసీ వైద్యుల సహకారంతో డీఆర్‌డీవో హైదరాబాద్ విభాగం కోవ్‌సాక్స్ పేరుతో ఓ కియోస్కుని తయారుచేసింది. ఈమేరకు డీఆర్‌డీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కియోస్క్ ద్వారా కరోనా రోగుల నుంచి లేదా అనుమానితుల నుంచి సులభంగా నమూనాలను సేకరించనున్నారు.

అద్దాలతో నిర్మించిన ఓ గది వంటి నిర్మాణంలోకి ముందుగా అనుమానితులు వెళ్తారు. అనంతరం బయట నుంచి వైద్యులు వారి నమూనాలను సేకరిస్తారు. ఫలితంగా తుంపరలు ఒకరి నుంచి మరొకరిపై పడకుండా ఉంటాయి. కియోస్క్‌లో ఉన్న ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా కోవ్ సాక్స్ ఎప్పటికప్పుడు దానంతట అదే శుద్ధి అవుతుంది.

ఫలితంగా పీపీఈ కిట్ల వినియోగం తగ్గటంతో పాటు 2 నిమిషాల్లోనే కోవ్ సాక్స్ పూర్తిగా శుభ్రపడి మరొకరిని పరీక్షించేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా తక్కువ సమయంలో ఎక్కువ నమూనాలను సేకరించేందుకు వీలు ఏర్పడుతుంది. ఈ విధంగా ఫుల్లీ ఆటోమేటిక్‌గా తయారు చేసిన 2 కోవ్ సాక్స్‌లను డీఆర్‌డీఎల్ ఇప్పటికే హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీకి అప్పగించినట్లు డీఆర్‌డీఎల్ ప్రకటించింది.

ఇదీ చూడండి:లాక్​డౌన్ 2.0పై రేపు మార్గదర్శకాలు- 3 జోన్లుగా భారత్​!

ABOUT THE AUTHOR

...view details