Kidnap Case In Hyderabad : ప్రియురాలు ప్రేమను కాదన్నా, భూ వివాదాల్లో అయినవాళ్లను దారికి తెచ్చుకోవాలన్నా సులభంగా సంపాదించాలన్నా కిడ్నాప్‌ను ఎంచుకుంటున్నారు. నగరంలో కొంతకాలంగా ఈ రకమైన నేరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్ పరిధిలో జరిగిన అపహరణ ఘటన ఇందుకు తాజా ఉదాహరణ నిలవగా ఏడాదికి రూపాయలు కోటి వేతనం అందుకునే అన్న సంపాదనపై సోదరి కన్ను పడింది. ప్రియుడి సహయంతో కరడు గట్టిన కిడ్నాపర్‌తో చేతులు కలిపి సొమ్ము కొట్టేసేందుకు ప్లాను వేసింది. చివర్లో కథ అడ్డం తిరగడంతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ తతంగంలో ప్రధాన నిందితుడు సురేశ్ అలియాస్ సూర్య మామూలు వ్యక్తి కాదు.
చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన మంగళ్‌హాట్ పోలీసులు
Hyderabad Police Crack Kidnapping Case : గతంలో 20-30కు పైగా అపహరణల కేసుల్లో కీలక సూత్రధారి. అప్పట్లో ఇతగాడిని పట్టుకునేందుకు ఆసిఫ్‌నగర్ పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. భోజగుట్టకు చెందిన సురేశ్ కరడుగట్టిన నేరస్థుడు. ఇతడి సోదరుడు సుధాకర్ మైనర్‌గా ఉన్నపుడే చోరిలకు పాల్పడుతూ హల్‌చల్ చేశాడు. 14 ఏళ్లకే జైలుకెళ్లాడు. అన్న బాటలోనే తమ్ముడు సురేశ్ నడిచాడు. కిడ్నాప్‌లకు పాల్పడటంలో ఇతడి స్టయిలే వేరు. సామాజిక మాధ్యమాల్లో ఆడపిల్లల నకిలీ ప్రొఫైల్స్‌తో తనకు తెలిసిన అబ్బాయిలకు, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపుతాడు. అటునుంచి సానుకూల స్పందన రాగానే అసలు నాటకం మొదలు పెడతాడు.
కిడ్నాపైన బాలుడికి కరోనా... పోలీసుల హైరానా..
డబ్బు ఇస్తానని ఆశచూపి : తనకు పరిచయం ఉన్న యువతులకు డబ్బు ఇస్తానని ఆశచూపి వలపు వల విసురుతాడు. ఆ యువతులతో మగవాళ్లకు వాట్సాప్ వీడియోకాల్స్ చేయించి ముగ్గులోకి దింపుతాడు. ఒంటరిగా కలిసేందుకు హోటల్ నిర్మానుష్య ప్రాంతానికి రమ్మంటూ ఆహ్వానిస్తాడు. తాను ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నానని, అప్పు చెల్లించని వారిని బెదిరించి తిరిగి పొందడానికి సహకారం కావాలంటూ కాలనీలోని యువకులను నమ్మించి పావులుగా వాడుకుంటాడు. కారులో కిడ్నాప్ చేసి అతడి ఫోన్ ద్వారానే కుటుంబ సభ్యులతో మాట్లాడించి దొరికినంత తీసుకొని బాధితులను వదిలేస్తారు. కిడ్నాప్ సమయంలో సురేశ్ కారు నడుపుతుంటే పట్టుకోవటం సాధ్యం కాదంటున్నారు పోలీసులు.