రాష్ట్ర ప్రభుత్వం పట్ల భాజపా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటంపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లకు పోలీసులు, అధికారులను విమర్శించడం ఓ ఫ్యాషన్‌గా మారిందని ఆరోపించారు. ఎంపీ అర్వింద్ తన నోటికి అడ్డూ అదుపు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పు చేస్తే.. వాటిని సరిదిద్దుకునేలా ప్రతిపక్ష పార్టీలు సలహాలు ఇవ్వాలని.. ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
'భాజపా నేతలు బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలి' - mla danam nagender distributed kalyana laxmi cheques
రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా నేతలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. నేతలు తమ తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఖైరతాబాద్ పెద్ద గణేశ్ వద్ద పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అనంతరం రాష్ట్రంలో నేరాలు అదుపులోకి వచ్చాయని దానం పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసుల పని తీరును.. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్న విషయాన్ని భాజపా నాయకులు గ్రహించాలని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం భాజపా నేతలు ఇలాగే వ్యవహరిస్తే... ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అంతకముందు ఖైరతాబాద్ పెద్ద గణేశ్ వద్ద పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వమే కబ్జా చేస్తే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి'