హైదరాబాద్ నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ మహా గణపతి జలప్రవేశానికి సిద్ధమయ్యాడు. ఆలయ కమిటీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి గణేశుడి శోభాయాత్రను ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలలోగా మహాగణపతి నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవసమితి పేర్కొంది.
జల ప్రవేశానికి మహా గణపతి సిద్ధం.. శోభాయాత్ర ప్రారంభం
ఖైరతాబాద్ మహా గణపతి జలప్రవేశానికి సిద్ధమయ్యాడు. కొవిడ్ నిబంధనలను అనుసరించి గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జలప్రవేశానికి మహా గణపతి సిద్ధం.. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం
ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వేడకలు నిరాడంబరంగా జరగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు