ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేశంపేట మాజీ తహసీల్దార్ లావణ్యను నాలుగు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు ఆమె నివాసంలో చేసిన తనిఖీల్లో రూ. 93 లక్షల నగదు, బంగారం, ఇతర ఆస్తుల పత్రాలు లభించాయి. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఆమెకు ఏ విధంగా వచ్చింది అనే దానిపై మరింత లోతుగా విచారించనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో పలువురిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లావణ్య చంచల్ గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
లావణ్య కస్టడీ కోరుతూ అనిశా పిటిషన్
కేశంపేట మాజీ తహసీల్దార్ లావణ్యను తమకు అప్పగించాలని కోరుతూ ఏసీబీ అధికారులు అనిశా ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విధి నిర్వహణలో ఆమె ఆర్జించిన అక్రమాస్తులపై మరింత లోతుగా విచారించనున్నారు.
కేశంపేట మాజీ తహసీల్దార్ కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్