తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై కీన్ స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమాలు - తెలంగాణ వార్తలు

కరోనాపై కీన్ స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వివిధ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని వైరస్ పట్ల చైతన్యవంతుల్ని చేస్తోంది. అందరూ విధిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఫౌండేషన్‌ డైరెక్టర్‌ క్రాంతి శ్రీనివాస్‌ తెలిపారు.

keen foundation, awareness program on corona
కరోనాపై అవగాహన కార్యక్రమం, కీన్ ఫౌండేషన్

By

Published : Jun 6, 2021, 11:39 AM IST

కరోనా మహమ్మారి పట్ల ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేసే సిబ్బందిని కీన్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ చైతన్యవంతుల్ని చేస్తోంది. పని చేసే చోట విధిగా మాస్కులు ధరిస్తూ, భౌతికదూరం పాటించాలని గుర్తు చేస్తోంది.

ఒకసారి కరోనా వచ్చి కోలుకున్నా రెండోసారి సోకే ప్రమాదం ఉందని కీన్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ క్రాంతి శ్రీనివాస్‌ తెలిపారు. కొవిడ్ నిబంధనలపై తమ సిబ్బందితో కలిసి వివిధ కార్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ కార్డు కోసం వచ్చే వారికి బయోమెట్రిక్ ద్వారా మాస్కులు లేకుండా ఫొటోలు తీయాల్సివస్తోందని పేర్కొన్నారు. దీని ద్వారా కరోనా వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయం చూడాలని కోరారు.

ఇదీ చదవండి:'కరోనాపై పోరాటం కోసం హోమం చేయాల్సింది'

ABOUT THE AUTHOR

...view details