తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ శుభాకాంక్షలు - KCR

'అత్యంత కీలకమైన తొలి ఐదు సంవత్సరాల్లో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన అడుగులు పడ్డాయి... తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు' - సీఎం కేసీఆర్​.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ శుభాకాంక్షలు

By

Published : Jun 1, 2019, 5:09 PM IST

Updated : Jun 1, 2019, 9:58 PM IST

తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐదు ప్రగతి వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని, ఉత్సాహంతో ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే అపూర్వ మహోద్యమాన్ని సాగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు, పారదర్శవంతమైన పాలన అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకోవడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు.

Last Updated : Jun 1, 2019, 9:58 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details