విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని భాజపా నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రేపు ఇందిరాపార్కు వద్ద మహిళా సంకల్ప దీక్ష చేపడుతున్నట్లు ఆమె వివరించారు. మద్యం అమ్మకాలను నియంత్రించడానికే దీక్షని పేర్కొన్నారు. రేపటి దీక్షపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా అరుణ మాట్లాడారు.
సీఎం అమలు చేస్తారా?
ఒక్క రోజులో మార్పు తీసుకురాలేమని... మద్యం నిషేధం కోసం భాజపా మహిళా సంకల్ప దీక్ష పేరిట తాను రెండు రోజులు నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వివరించారు. తెలంగాణలో మద్యం వల్లనే ఎక్కువ ఆదాయం వస్తోందని... అలాంటప్పుడు సీఎం కేసీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తారా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.