తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాలను వికసింపజేద్దాం: కేసీఆర్​ - PRAGATHI

గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం ప్రగతి బాటలో పయనిస్తాయి. అలాంటి పట్టుకొమ్మల్లో పాలకవర్గానికి సరైన శిక్షణ ఇచ్చి రాష్ట్రాన్ని నందనవనంగా మార్చాలని సీఎం పిలుపునిచ్చారు.

సమష్టిగా అభివృద్ధి సాధిద్దాం: కేసీఆర్​

By

Published : Feb 6, 2019, 6:03 PM IST

పల్లె వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్సు పర్సన్స్​తో ప్రగతి భవన్​లో సమావేశమయ్యారు. అందరిని కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటు పడాలని దిశానిర్దేశం చేశారు. సర్పంచులను, గ్రామ కార్యదర్శులను సంధానకర్తలుగా మార్చే బాధ్యత రిసోర్స్ పర్సన్లు చేపట్టాలన్నారు.
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని సీఎం కోరారు. మంచినీరు, విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం లాంటి ముఖ్యమైన పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠధామాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు.
గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు, విధులు కేటాయిస్తామన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించినా... పదవుల నుంచి తొలగించే విధంగా చట్టాన్ని రూపొందించామని స్పష్టం చేశారు.
గ్రామాల వికాసానికి అంకితభావంతో పనిచేసేందుకు సర్పంచులకు కావాల్సిన అవగాహనను, చైతన్యాన్ని రిసోర్స్ పర్సన్స్ కలిగించాలని కేసీఆర్​ కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details