ఇవాళ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐటీరంగానికి కేసీఆర్ అధికప్రాధాన్యత ఇచ్చారు.
హైదరాబాద్@ఐటీ హబ్‌గా గుర్తింపు
By
Published : Feb 22, 2019, 2:32 PM IST
హైదరాబాద్@ఐటీ హబ్‌గా గుర్తింపు
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఐటీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం ముందుకువచ్చే వారికి టీఎస్ఐపాస్ విధానం ఎంతో ఆకర్షణీయంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా 8లక్షల 58వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రకటించారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిందని హర్షం వ్యక్తం చేశారు.