తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్​

శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనాయి. మెుదటి రోజు పురపాలక శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​ కొత్త పురపాలక​ చట్టం ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

By

Published : Jul 18, 2019, 11:20 AM IST

Updated : Jul 18, 2019, 12:16 PM IST

కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్​

రెండు రోజుల పాటు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలిపింది. అలాగే విద్యాశాఖ మంత్రికి స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పురపాలక శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్​... నూతన మున్సిపల్​ చట్టం బిల్లు ముసాయిదాను ప్రవేశపెట్టారు. 4 ఆర్డినెన్సుల స్థానంలో ప్రభుత్వం బిల్లును సభ ముందుకు తీసుకొచ్చింది.సాయంత్రం వరకు బిల్లులో సవరణలు స్వీకరించనున్నారు. రేపు బిల్లుపై సమగ్ర చర్చ జరుగుతుంది. వీటితో పాటు బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయో పరిమితి పెంపు బిల్లును కూడా సభ ముందుంచారు. దీనికి సభ వెంటనే ఆమోదం తెలిపింది.

అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్​
Last Updated : Jul 18, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details