KTR On Brs party opening: దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యలయ ప్రారంభం దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు నాంది అవుతుందని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లో ప్రవేశించినట్లు కేటీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించిన కేసీఆర్ ఇప్పుడు దేశ హితం కోసం నూతన ఒరవడిని ప్రారంభించినట్టు కేటీఆర్ పేర్కొన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకే.. బీఆర్ఎస్: కేటీఆర్ - KTR wishes all BRS activists
KTR On Brs party opening: దిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యలయ ప్రారంభం.. దేశంలో మార్పుకు నాంది అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను సాధించి అభివృద్ధి పథంలో నడుపుతున్న కేసీఆర్ దేశంలో మార్పు తెచ్చెందుకే జాతీయ రాజకీయాల్లో ప్రవేశించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్
తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు భారాస వేదికగా దేశమంతటికీ పరిచయమవుతాయని ఆయన అన్నారు. ముందుగా ఖరారైన రెండు కీలక పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలతో పాటు సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్లు ఉన్నందున దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయానికి హాజరు కాలేకపోయినట్లు కేటీఆర్ తెలిపారు. భారాస కేంద్ర కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: