ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కేవలం డబ్బులు ఖర్చు చేయడం వల్ల మాత్రమే సాధ్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఎన్ని కోట్లు వెచ్చించినా జరగని మార్పు... ఒక మంచి విధానం తీసుకురావడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. తెలంగాణ గ్రామాలు, పట్టణాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ, పట్టణ విధానం తీసుకొచ్చిందని చెప్పారు. అందులో భాగంగానే కొత్త పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను అమలు చేయగా... నూతన రెవెన్యూ చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా గ్రామాలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు రూ2,714 కోట్లు, పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు కేటాయించారు.
కొత్త చట్టాలతో మెరుగైన పాలన: కేసీఆర్ - grama panchayt
స్వరాష్ట్రంలో సుపరిపాలన నినాదంతో ప్రభుత్వం పెద్దఎత్తున పరిపాలనా సంస్కరణలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టిన సీఎం...గ్రామ పంచాయతీలకు రూ2,714 కోట్లు, పురపాలక సంఘాలకు రూ.1,764 కోట్లు కేటాయించారు.
Budget