ఆరు నెలల క్రితం జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో కూలిపోయిన 20 ఏళ్ల నాటి వృక్షాన్ని పాదచారులు తిరిగి నిలబెట్టారు. గతేడాది సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కేబీఆర్ పార్కులో నడక దారిలో ఉన్న భారీ వృక్షం వేర్లతో సహా పడిపోయింది.
వరదల్లో నేలకూలింది.. వాకర్ల సాయంతో ప్రాణం పోసుకుంది.! - kbr walkers replanted 20 year old tree
గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు మునిగిపోయాయి. వరదలతో హైదరాబాద్ అల్లకల్లోలమైంది. అంతే కాకుండా పాదచారులకు ఆహ్లాదాన్ని పంచే కేబీఆర్ పార్కులో ఇరవై ఏళ్ల నాటి వృక్షం నేల కూలింది. అది చూసిన వాకర్లకు గుండె తరుక్కుపోయిందో ఏమో.. ఎంతో శ్రమించి ఆ చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు.
కేబీఆర్ పార్కు
ఈ మధ్య కాలంలో చెట్టు చిగురించడంతో ఆ దారిలో నడిచే వాకర్లు చెట్టును తమ సొంత ఖర్చులతో తిరిగి నిలబెట్టారు. పార్కులో ప్రతి రోజు వాకింగ్‌కు వచ్చే వారికి ఆక్సిజన్‌ను పంచిన చెట్టును నిలబెట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పాదచారులు తెలిపారు.
ఇదీ చదవండి:యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం