Kaynes Technology Company Investment in Hyderabad : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. దాదాపు రూ.2800 కోట్ల పెట్టుబడితో.. కెయిన్స్ టెక్నాలజీ (Kaynes Technology Company) రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఓసాట్, కాంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కెయిన్స్ టెక్ ఎంఓయూ కుదుర్చుకుంది. 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం కెయిన్స్ సంస్థ నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు గర్వకారణమన్న మంత్రి... సెమీ కండక్టర్ పరిశ్రమ ఉన్న ప్రపంచ స్థాయి కేంద్రాల్లో హైదరాబాద్ కూడా చేరుతోందని అన్నారు. ఫాక్స్ కాన్, కార్నింగ్, కెయిన్స్ తదితర సంస్థల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కూడా తెలంగాణ ఉత్తమ రాష్ట్రంలో నిలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
LULU Group in Telangana : రాష్ట్రంలో లులూ గ్రూప్ రూ.3500 కోట్ల పెట్టుబడి.. కేటీఆర్ హర్షం
Goldman Sachs Opened New Office in Hyderabad : మరోవైపు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ కొత్త ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రపంచస్థాయి సంస్థలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా మారిందని.. 100కి పైగా దేశాలకు చెందిన సంస్థల పారిశ్రామిక, ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడి నుంచే సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, సానుకూల పర్యావరణ వ్యవస్థల వల్ల హైదరాబాద్ అన్ని దేశాలను ఆకర్షిస్తోందన్నారు.
2021లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన గోల్డ్‌మన్ శాక్స్ సుస్థిర సేవల కోసం అత్యాధునిక వసతులతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఇలాంటి బహిళ జాతి సంస్థలు యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. గోల్డ్‌మన్ శాక్స్ డిజిటల్ అక్షరాస్యత, మహిళా వ్యవస్థాపకత తదితర సేవా కార్యకలాపాల ద్వారా తెలంగాణలో నిబద్ధతతో పని చేస్తోందని అన్నారు. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. 3.51 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2,500 మంది నిపుణులు పనిచేసే అవకాశం ఇక్కడ ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి అనేక కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాయి. అన్నింటికీ హైదరాబాద్ అనువైన ప్రాంతం కావడంతో పెద్దపెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
Kitex and Sintex Companies Invests in Telangana : రాష్ట్రానికి మరో రెండు కొత్త పరిశ్రమలు.. 1200 వేల మందికి ఉపాధి
KTR at Chicago Food Stop : 'తెలంగాణ ఫుడ్స్టాప్' తెస్తాం.. షికాగోలో 'ఆహారంలో సృజనాత్మకత'పై ప్రసంగంలో కేటీఆర్