Kasani Gnaneshwar Joins BRS Party :ఇటీవల తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar).. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) ఈసారి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదన్న కారణంతో అసంతృప్తి చెందిన కాసాని జ్ఞానేశ్వర్.. గత నెల 30వ తేదీన పార్టీకి రాజీనామా చేసి.. నేడు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
Kasani Gnaneshwar Resigns Telangana TDP :గత నెల 30న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడుకాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి అధిష్ఠానం నిరాకరించడంతో తన పదవికి రాజీనామా(Kasani Resigns Telangana TDP) చేశారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పగా.. అందుకు శ్రేణులు పోటీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో భావోద్వేగానికి గురైన కాసాని.. వెంటనే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈసారి కచ్చితంగా పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ గతంలో వెల్లడించారు. దానికి అనుగుణంగానే తొలి విడత సన్నాహాల్లో 87 మంది అభ్యర్థుల జాబితాతో పాటు మేనిఫెస్టో రూపకల్పన సైతం సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
Kasani Gnaneshwar Resigns from TTDP : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా