నియోజకవర్గంలో సమస్యలను పరిశీలించిన కార్వాన్ ఎమ్మెల్యే - karwan MLA examined the problems in the constituency
కార్వాన్ ఎమ్మల్యే కౌసర్ మొహియుద్దీన్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు.
నియోజకవర్గంలో సమస్యలను పరిశీలించిన కార్వాన్ ఎమ్మెల్యే
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ హైదరాబాద్లోని షాతం చెరువు, నదీమ్ కాలనీ, కూలి కుతుబ్ షా నగర్, బాలరెడ్డి నగర్, అక్బర్ పురా,నానల్ నగర్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జీహెచ్ఎంసీ అధికారులు, పలువురు కార్పొరేటర్లతో కలిసి పర్యటించి.. స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు. నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: ఆ 3 బిల్లులు రైతులకు మేలు చేయవు: హర్షవర్ధన్