రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అవలంభిస్తోన్న విధానాలను తెలుసుకునేందుకు కర్ణాటక ఫుడ్ కమిషన్ అధికారుల బృందం పౌరసరఫరాల కార్యాలయానికి విచ్చేశారు. రేషన్ సరకులు తరలించే వాహనాలు పక్కదారి పట్టకుండా జీపీఎస్ యంత్రాలను అమర్చి ప్రత్యక్షంగా తెలుసుకునేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అద్భుతంగా ఉందని ప్రశంసించింది.
'ప్రజా పంపిణీ వ్యవస్థలో తెలంగాణ భేష్' - Karnataka_Food_Commission
తెలంగాణలో ప్రజా పంపిణీ విధానం చాలా బాగుందని కర్ణాటక ఫుడ్ కమిషన్ కితాబిచ్చింది. రాష్ట్రంలో ప్రజా పంపిణీ విధానాలను పరిశీలించేందుకు కర్ణాటక ఫుడ్ కమిషన్ ఛైర్మన్ కృష్ణమూర్తి, సభ్యులు కసిబిన్, మంజులాబాయి తదితరులు పౌరసరఫరా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు.

పౌరసరఫరాల కార్యాలయంలో కర్ణాటక బృందం
తెలంగాణ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తిరుమల రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌తో సమావేశమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఈ-పాస్ మిషన్ పనితీరు, ఐరిస్ విధానాన్ని అధికారుల బృందం పరిశీలించింది. టీ రేషన్ యాప్, పోర్టబిలిటీ, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్ సరకులు పక్కదారి పట్టకుడా వాహనాలకు జీపీఎస్ వంటి విధానాలు అభినందనీయమని కర్ణాటక ఫుడ్ కమిషన్ సభ్యులు కొనియాడారు.
ఇదీ చూడండి: కోతుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేశాడంటే?