మూడేళ్ల రికార్డు సమయంలోనే సిద్ధమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఘట్టాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి చరిత్రకు అందించడం హర్షణీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే రచించిన కాళేశ్వరం ప్రాజెక్టు - తెలంగాణ ప్రగతి రథం పుస్తకాన్ని కేసీఆర్ ప్రగతి భవన్లో ఆవిష్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్ - Kaleswaram Project Telangana Pragathi ratham Book Released by CM KCR
కాళేశ్వరం.. ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే 'కాళేశ్వరం ప్రాజెక్టు- తెలంగాణ ప్రగతి రథం' అనే పుస్తకాన్ని రూపొందించారు. దీనిని కేసీఆర్ ఆవిష్కరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం
కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే నిర్మాణం పూర్తై రైతులకు నీరిచ్చే దశకు చేరుకుందన్నారు. ప్రాజెక్టు సమగ్ర సమాచారం, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే దేశ్ పాండే పుస్తకాన్ని రాశారని అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ దీక్షతో చేసిన కృషి, ఇంజనీర్ కంటే ఎక్కువగా గూగుల్ ఎర్త్ సాయంతో చేసిన పరిశోధనలన్నింటినీ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్లు శ్రీధర్ దేశ్ పాండే తెలిపారు.
ఇవీ చూడండి : క్యాంటీన్ సబ్సిడీకి స్వస్తి పలకనున్న ఎంపీలు!