తెలంగాణ

telangana

ETV Bharat / state

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో సత్తా చాటిన ప్రొద్దుటూరు యువకుడు - జేఈఈ అడ్వాన్స్​డ్ ఆల్ ఇండియా రెండో ర్యాంకు

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో ఏపీ కడప జిల్లా ప్రొద్దుటూరు యువకుడు సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో సత్తా చాటిన ప్రొద్దుటూరు యువకుడు
జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో సత్తా చాటిన ప్రొద్దుటూరు యువకుడు

By

Published : Oct 5, 2020, 10:47 PM IST

ఏపీ క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు బుడ్డాయ‌ప‌ల్లెకు చెందిన గంగుల భువ‌న్‌రెడ్డి... జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించాడు. భువన్ త‌ల్లిదండ్రులు, బంధ‌వులు ఆనందం వ్య‌క్తం చేశారు.

చ‌ర‌వాణి ద్వారా యువకుడిని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందించారు. ఐఐటీ ముంబయిలో సీటు సాధించటమే తన ల‌క్ష్యమన్న భువన్... త‌ల్లిందండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో ఈ విజయం సాధించగలిగానని చెప్పాడు.

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫ‌లితాల్లో సత్తా చాటిన ప్రొద్దుటూరు యువకుడు

ఇదీ చూడండి:'పండుగల సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించండి'

ABOUT THE AUTHOR

...view details