గాంధీ ఆస్పత్రిలో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించకపోవడంపై జూనియర్ డాక్టర్ల సంఘం సమ్మెకు దిగింది. ప్రభుత్వానికి ఎన్ని సార్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఇందుకు నిరసనగా గురువారం నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్పత్రి ప్రాంగణంలో కొవ్వొత్తులతో జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు.
నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలని గాంధీలో జూడాల సమ్మె - జూనియర్ డాక్టర్ల సమ్మె
గాంధీ ఆస్పత్రిలో నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించకపోవడంపై జూనియర్ డాక్టర్ల సంఘం సమ్మెకు దిగింది. ఈ రోజు నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య సేవలు పునఃప్రారంభించకపోవడం వల్ల ఇతర రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించాలని గాంధీలో జూడాల సమ్మె
నాన్ కొవిడ్ సేవలు ప్రారంభించకపోవడం వల్ల మిగిలిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. విద్యార్థులు వారి విద్యాసంవత్సరంలో 7 నెలలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మంది అధ్యాపకులు, 350 మంది ఇంటెర్న్షిప్ చేసేవారు, 600 మంది నర్సులు, 600 మంది రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ఇదీ చదవండి:'సరికొత్త పంథాలో బైడెన్ 'దౌత్య' పాలన'