పది రోజుల కిందట హైదరాబాద్ నీలోఫర్లో వైద్యులపై జరిగిన దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి భవనం ముందు నిరసన చేపట్టారు. తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పారా మెడికల్ సిబ్బందిని పెంచాలని, మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని కోరారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించేంత వరకు నిరసన కొనసాగుతుందని జూడాలు స్పష్టంచేశారు.
నీలోఫర్లోనూ నిరసన... - నిరసన
వైద్యులపై దాడులు నిరసిస్తూ హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
నిరసన తెలుపుతున్న జూడాలు