Juda's Strike: అత్యవసర సేవలు బహిష్కరించిన జూడాలు - junior doctors strike continue
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు సమ్మె కొనసాగుతోంది. డిమాండ్‌లపై లిఖిత పూర్వక హామీ రాలేదని జూడాలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో జూడాలు సమ్మె కొనసాగిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు(జూడా) చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లపై లిఖిత పూర్వక హామీ రానందునే సమ్మె కొనసాగిస్తున్నట్లు జూడాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూడాలు సమావేశం కానున్నారు. సీఎం కేసీఆర్ డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో.. నిన్న అర్ధరాత్రి వరకూ ఉన్నతాధికారులతో జరిగిన చర్చల గురించి ఇందులో చర్చించనున్నారు. ఇప్పటికే అత్యవసర సేవలు సైతం బహిష్కరించారు. .