జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లో బోరబండలో పర్యటించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, బంజరనగర్, రాజునగర్‌లో నిర్మించిన కమిటీ హాల్‌ను ప్రారంభించారు. బోరబండ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
'బోరబండను బంగారుబండగా మార్చడమే మా లక్ష్యం' - హైదరాబాద్ వార్తలు
బోరబండను బంగారు బండగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. నియోజకవర్గంలోని బోరబండ డివిజన్లో పలు అభివృద్ధి పనులతో పాటు బంజారనగర్, రాజునగర్‌లో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్‌ను డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి ప్రారంభించారు.
'బోరబండను బంగారుబండగా మార్చడమే మా లక్ష్యం'
తెరాస ప్రభుత్వ హయాంలో బోరబండను బంగారు బండగా మార్చుతున్నట్లు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక తెరాస పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని