తెలంగాణ

telangana

ETV Bharat / state

జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు - JP NADDA REACHED HYDERABAD

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. సాయంత్ర నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరగనున్న భాజపా భారీ బహిరంగ సభకు నడ్డా హాజరుకానున్నారు.

జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

By

Published : Aug 18, 2019, 12:42 PM IST

భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నగరానికి చేరుకున్నారు. దిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జేపీ నడ్డాకు... రాష్ట్ర భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు నేతలు, నాయకులు నడ్డాకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి నడ్డాతో పాటు నేతలంతా వాహన శ్రేణిలో పయనమయ్యారు. దారి పొడవునా భాజపా శ్రేణులు నడ్డాకు స్వాగతం పలుకుతూ... బ్యానర్లు ఏర్పాటు చేశారు.

జేపీ నడ్డాకు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details