పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్ ప్రసిద్ధి చెందుతోందని... ఉద్యోగ అవకాశాలు వెల్లువెత్తనున్నాయని నగర సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఆసీఫ్‌నగర్‌లో సిటీ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి 450 మంది నిరుద్యోగ యువత హాజరైనట్లు సీపీ తెలిపారు. ఇలాంటి జాబ్‌మేళాను వినియోగించుకుని యువత ఉద్యోగాలు సంపాదించుకోవాలని సూచించారు. ఈ జాబ్‌మేళాలో మొత్తం 31 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హులైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ అంజన్‌కుమార్‌తో పాటు డీసీపీ సుమతి, ఆసీఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు.
ఉపాధి అవకాశాలకు అడ్డా హైదరాబాద్: సీపీ అంజనీకుమార్
ఉపాధి అవకాశాలు రోజురోజుకు నగరంలో పెరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సిటీ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆసీఫ్‌నగర్‌లో నిర్వహించిన జాబ్‌మేళాకు మంచి స్పందన లభించింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని సీపీ సూచించారు.
JOB MELA CONDUCTED IN HYDERABAD UNDER CITY POLICE COMMISSIONERATE