తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. వ్యవసాయ పంట రుణాలు, దీర్ఘకాలిక, మధ్యకాలిక పంట రుణాలపై వడ్డీ రాయితీ కొనసాగించాలని కోరారు. అందుకు అవసరమైన నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తీసుకుంటున్న రుణాలపై 7శాతం వడ్డీ ఉండగా మూడు శాతం కేంద్రం, నాలుగు శాతం రాష్ట్రం భరిస్తూ వచ్చాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయకపోవటంతో వడ్డీ లేని రుణాలు రైతులు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే నాలుగు శాతం వడ్డీ రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
4శాతం రాయితీని విడుదల చేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతులు తీసుకుంటున్న పంట రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న 4శాతం రాయితీని వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్‌కు లేఖ రాశారు.
4శాతం రాయితీని విడుదల చేయాలి: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి