ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ కరోనా వ్యాధిగ్రస్తులకు విశ్వాసం కల్పించలేక పోవడం వల్ల వారు కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. దానితో ప్రైవేటు యాజమాన్యం పేదలను దోచుకుంటుంది. ఈ దోపిడీని ప్రభుత్వమే నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కొవిడ్ రోగులకు ఇచ్చిన ఇన్సెన్టివ్ కేవలం రెండు మాసాలకే పరిమితం చేయడం బాధాకరమని.. దాన్ని మరో ఆరు మాసాలు ఇవ్వడానికి ప్రయత్నించడని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం కరోనా రోగులకు విశ్వాసం కల్పించలేకపోతుంది: జీవన్‌రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2020
కరోనా చికిత్సకై కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా బెడ్ ఛార్జ్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వంపై వారికి విశ్వాసం కల్పించడం ద్వారా ఈ ప్రైవేటు దోపిడీని నివారించవచ్చని ఆయన మండలి వేదికగా తెలిపారు.
గత నెలలో ఒక్క జగిత్యాల జిల్లాలోనే సుమారు రోజుకు 300 కేసులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల్లో మాత్రం 100లోపే ఉంటున్నాయన్నారు. మంత్రి ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీయూ స్కాన్ పనిచేయకపోవడం వల్ల ప్రజలపై భారం పడుతోంది. కాబట్టి దానిని ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా కట్టడికై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు సంతోషకరమని.. త్వరితగతిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. కరోనా నివారణ చికిత్సకై కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్‌ను పొందడం మన హక్కు అని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు