ఐఐటీల్లో (iits) సీట్ల భర్తీ కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకులు (Jee Advanced Ranks) ఇవాళ విడుదల కానున్నాయి. ఈనెల 3న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్ పరీక్షకు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 20 వేల మంది పరీక్ష రాశారు (JEE ADVANCED RANKS ). ఇటీవల విడుదలైన కీ ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచి పదిలోపు ర్యాంకులు ముగ్గురు, నలుగురికి రావొచ్చని.. వందలోపు ర్యాంకులు కనీసం 25 ఉంటాయని శిక్షణ సంస్థల అంచనా వేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిచే మరో 33 విద్యా సంస్థల్లోని సుమారు 51 వేల సీట్ల భర్తీ కోసం ఆరు విడతల్లో జరిగే ప్రవేశాల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయని సంయుక్త సీట్ల కేటాయింపు సంస్థ.. జోసా తెలిపింది. ఈనెల 27న తొలి విడత, నవంబరు 1న రెండో విడత, 6న మూడో విడత, 10న నాలుగో విడత, 14న అయిదో విడత, 18న చివరి విడత సీట్లు కేటాయించనున్నట్లు జోసా ప్రకటించింది.
ఈసారి కఠినంగా
ఐఐటీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced exam 2021) కఠినంగా ఉందని నిపుణులు స్పష్టం చేశారు. గత ఏడాది పరీక్షతో పోల్చుకున్నా కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈసారి పేపర్-1 కంటే పేపర్-2 ప్రశ్నపత్రం కష్టంగా ఉందని పేర్కొన్నారు.