తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ పరిశోధనలో దక్షిణాదిన మనకే తొలిస్థానం

2018 సంవత్సరానికి సంబంధించి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాలకు కేటాయించిన ర్యాంకుల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

6వ స్థానం నుంచి తొలి స్థానానికి జయశంకర్ వర్సిటీ

By

Published : Jul 20, 2019, 12:31 PM IST

Updated : Jul 20, 2019, 12:45 PM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాది వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో మొదటి ర్యాంకు సాధించింది. దేశంలో కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో 6వ ర్యాంకు కైవసం చేసుకుంది.

2016లో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించిన వర్సిటీ... 2018లో 6వ ర్యాంకుకి తన స్థానం మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ మొదటి ర్యాంకు సాధించడం పట్ల ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 2014లో స్థాపితమైన విశ్వవిద్యాలయం అధునాతన ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలు, వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు, పరిశ్రమలతో అభివృద్ధి పథంలో నడుస్తోందని ఉపకులపతి ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో పోటీపడగలిగే వ్యవసాయ రంగ నిపుణుల్ని తీర్చిదిద్దడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కాళేశ్వరం మేడిగడ్డ బ్యారెజీ గేట్ల ఎత్తివేత

Last Updated : Jul 20, 2019, 12:45 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details