జయరాం కేసులో కీలక 'వీడియో'
జయరాం హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటికొస్తోంది. ఆస్తి కోసం హత్య, బాండ్ పేపర్లపై సంతకాలు.. ఇదంతా వీడియో చిత్రీకరించి నిందితుడు మరో నేరానికి పథకం రచించాడు.
చిగురుపాటి
వీణ పేరుతో సంక్షిప్త సందేశం పంపి జయరాంను రాకేష్ తన ఇంటికి రప్పించాడనేది తెలిసిందే. రాకేష్తో వివాదాలున్నప్పటికీ జయరాం అక్కడికి ఎలా వెల్లాడనే కోణంలో పోలీసులు ప్రశ్నించగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. వాస్తవానికి గత నెల 30న వీణ ఇంటికే తీసుకువెళ్తున్నట్లుగా రాకేష్ రెడ్డి స్నేహితులు నమ్మించారు. రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా జయరాం చివరి నిమిషంలో గుర్తించాడు.
జయరాం నుంచి డబ్బులు రాబట్టేందుకు రాకేష్ ప్రయత్నించాడు. సర్దుబాటు చేయాలని పలువురికి ఫోన్ చేయించినట్లు బయటపడింది. కోస్టల్ బ్యాంకు ఉద్యోగి దస్పల్లా హోటల్లో అప్పగించిన 6లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Last Updated : Feb 18, 2019, 7:40 AM IST