తెలంగాణ

telangana

ETV Bharat / state

జనసేన సభకు స్థలం ఇస్తే.. ఇళ్లు కూల్చివేస్తారా..? - ap latest news

Houses Demolition At Ippatam Village: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు.. ఇళ్లు కూల్చివేస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో 600 కుటుంబాలు ఉన్నాయి దాదాపు 2వేల జనాభా ఉంటుంది. ఎక్కువమంది జనసేన మద్దతుదారులు కావటంతో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్ల కూల్చివేత చేపట్టారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Houses Demolition At Ippatam Village
Houses Demolition At Ippatam Village

By

Published : Nov 5, 2022, 7:19 PM IST

Houses Demolition At Ippatam Village: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ ఇళ్లను కూల్చివేశారని మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు.. ఇళ్లు కూల్చివేస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామంలో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గృహ యాజమానులకు ముందస్తు నోటీసులివ్వకుండా కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి వచ్చే రోడ్లకంటే గ్రామంలోని అంతర్గత రహదారులే విశాలంగా ఉన్నప్పటికీ.. ఎందుకీ కక్ష సాధింపు చర్యలంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.

జనసేన మద్దతు దారులు ఉన్నారనే:మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్బావ సభకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామస్థులు తమ పొలాల్ని ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ ఆంక్షలతో బహిరంగసభకు స్థలం దొరకని సమయంలో ఇప్పటం గ్రామస్థులు ముందుకు వచ్చారు. తమ పొలాల్లో సభ నిర్వహించుకునేందుకు అనుమతించారు.

దీనిపై కక్ష గట్టిన ప్రభుత్వం ఏప్రిల్​లో గ్రామస్థులకు నోటీసులు జారి చేసింది. దానిపై వారు కోర్టుని ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే శుక్రవారం నాడు వచ్చి ఇళ్లు, ప్రహరీలు కూల్చివేశారు. ఈ గ్రామంలో 600 కుటుంబాలు దాదాపు 2వేల జనాభా ఉంటుంది. ఎక్కువమంది జనసేన మద్దతుదారులు కావటంతో రోడ్ల విస్తరణ పేరిట ఇళ్ల కూల్చివేత చేపట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details