తెలంగాణ

telangana

ETV Bharat / state

'లోక్​సభ ఎన్నికల ఫలితాలు సర్కారుకు గుణపాఠం' - JANAREDDY

ఎంపీ ఎన్నికల ఫలితాలు తెరాస ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి హైదరాబాద్​ గాంధీభవన్​లో పేర్కొన్నారు. కేసీఆర్ నిరంకుశ వైఖరికి లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు.

'ఎంపీ ఎన్నికల ఫలితాలు సర్కారుకు గుణపాఠం'

By

Published : May 25, 2019, 3:12 PM IST

Updated : May 25, 2019, 7:51 PM IST

ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే కొన్నిసార్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. తాను పార్లమెంటుకు పోటీ చేస్తానంటే అధిష్ఠానం నాకు టికెట్‌ ఇచ్చేదని వెల్లడించారు. 88 సీట్లు గెలిచిన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సబబు కాదని విమర్శించారు. ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పడంలో భాగంగానే ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం వదిలేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు సహించరని స్పష్టం చేశారు.

'ఎంపీ ఎన్నికల ఫలితాలు సర్కారుకు గుణపాఠం'
Last Updated : May 25, 2019, 7:51 PM IST

For All Latest Updates

TAGGED:

JANAREDDY

ABOUT THE AUTHOR

...view details