తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: స్వరూప రాంసింగ్ - తెలంగాణ రాజకీయ వార్తలు

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని జంగంమేట్ డివిజన్ తెరాస అభ్యర్థి స్వరూప రాంసింగ్ నాయక్ అన్నారు. విజయం సాధించాక.. రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్​రూం, వరదసాయం వంటి సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

jangammet division trs candidate
తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: స్వరూప రాంసింగ్

By

Published : Nov 24, 2020, 11:01 AM IST

గ్రేటర్​ హైదరాబాద్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తానని పాతబస్తీ జంగంమేట్ డివిజన్ తెరాస అభ్యర్థి స్వరూప రాంసింగ్ నాయక్ హామీ ఇచ్చారు. సోమవారం.. జంగంమేట్ డివిజన్​లోని లక్ష్మీనగర్, శివగంగ నగర్, శివాజీ నగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తెరాసతోనే అభివృద్ధి సాధ్యమన్న ఆమె.. గెలిచాక.. రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్​రూం, వరదసాయం వంటి సమస్యలు పరిష్కరిస్తానన్నారు.

తెరాసతోనే అభివృద్ధి సాధ్యం: స్వరూప రాంసింగ్

ఇవీచూడండి:తెలంగాణలో తాగు నీళ్లు ఉచితం.. డిసెంబర్ నుంచి అమలు

ABOUT THE AUTHOR

...view details