తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైకమాండ్ అనుమతి ఉంటే రేవంత్ పాదయాత్రకు అందరం సహకరిస్తాం' - తెలంగాణ తాజా వార్తలు

Jaggareddy comments on BJP: రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలకు ఓట్లు రాలవని జగ్గారెడ్డి అన్నారు. ప్రజామద్దతులో మెదటి స్థానంలో అధికార పార్టీ టీఆర్ఎస్, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ సమావేశాల్లో ఈ విషయం గురించి ప్రస్తావిస్తానని వివరించారు.

Jaggareddy comments on BJP
Jaggareddy comments on BJP

By

Published : Nov 28, 2022, 4:23 PM IST

Updated : Nov 28, 2022, 4:48 PM IST

బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలుకు ఓట్లు రాలవు: జగ్గారెడ్డి

Jaggareddy comments on BJP: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న హైటెక్ డ్రామాలకు ఓట్లు రాలవని, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మొదటి స్థానంలో, రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందని తెలిపారు. కాంగ్రెస్‌లో సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పడం వాస్తవం కాదని వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఏకపక్షంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని వివరించారు. ఎన్నికల వరకు రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా ఉంటారని స్పష్టం చేసిన జగ్గారెడ్డి, రేవంత్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఎందుకు తొందరపడి ఇచ్చారో అడుగుతానన్నారు. రేవంత్ రెడ్డి అధిష్టానం అనుమతితో పాదయాత్ర చేసినట్లయితే, తనతో పాటు అందరం సహకరిస్తామని స్పష్టం చేశారు.

రేవంత్​రెడ్డి పాదయాత్ర చేస్తే నేను ఫూల్​గా సహకరిస్తా, ఇప్పుడు అన్నిటికీ సమస్య పరిష్కారం జగ్గారెడ్డి చాలా ఒపెన్ మైన్డ్​గా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా అంతే మాట్లాడుతాడు. రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఆయనకు పర్మిషన్ ఇచ్చి పాదయాత్రకు బయలుదేరు అంటే.. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను పూర్తిగా సహకరిస్తాను.-జగ్గారెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details