డెంగీ, క్యాన్సర్ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిలకు లేఖలు రాయనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ రోగం వస్తే.... తక్కువలో తక్కువ 60వేలు నుంచి లక్ష వరకు ఖర్చు అవుతోందని తెలియజేశారు. డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి - ముఖ్యమంత్రి కేసీఆర్
డెంగీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వ్యాధి. ఈ జ్వరం కుటుంబంలో ఇద్దరికో.. ముగ్గురికో వచ్చిందంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని దీనిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి
అదే విధంగా క్యాన్సర్ వస్తే లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తోందని పేద, మధ్య తరగతి ప్రజలు భరించలేకపోతున్నారని వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, చిన్న జీయర్ స్వామి స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: మరింత అందంగా భాగ్యనగరం..